కరోనా టైమ్: విమాన ప్రయాణాలకి తెలంగాణలో ఉన్న నిబంధనలు తెలుసుకోండి..

-

కరోనా టైమ్ లో విమాన ప్రయాణాలకి అనేక నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విమాన ప్రయాణం చేయాలంటే ఎలాంటి నిబంధలు పాటించాలి, దేశీయ విమాన ప్రయాణానికి, విదేశీ విమాన ప్రయాణానికి గల నిబంధనల్లో తేడాలు ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ ప్రయాణాలు:

తెలంగాణకి వచ్చే సందర్శకులకి కరోనా లక్షణాలు లేనట్లయితే క్వారంటైన్ అవసరం లేదు. కానీ లక్షణాలు కనిపిస్తే గనక, ఐసోలేట్ అయిపోయి హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం అనుసరించాల్సిందే.

విదేశీ ప్రయాణాలు:

విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులకి కరోనా లక్షణాలు ఉన్నట్లయితే ఐసోలేట్ కావాల్సిందే. లక్షణాలు లేనట్లయితే ఎయిర్ పోర్ట్ నుండి డైరెక్ట్ క్వారంటైన్ సెంటర్ కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఏడు రోజులు క్వారంటైన్ ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళవచ్చు. ఇంటి దగ్గర మరో ఏడు రోజులు క్వారంటైన్ లో ఉండాలి.

ప్రయాణీకులకి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే, గర్భవతులైన మహిళలకి, కుటుంబంలో ఎవరైనా చనిపోయినపుడు, తమతో పాటు 10సంవత్సరాల తక్కువ వయసు పిల్లలుండి వారు ఏదైనా జబ్బుతో బాధపడుతున్నప్పుడు, వారు డైరెక్ట్ గా ఇంటికే వెళ్ళవచ్చు. 14రోజుల పాటు హోమ్ క్వారంటైన్ ఉండాల్సి ఉంటుంది.

ఎవరైతే కరోనా నెగెటివ్ రిపోర్ట్ తీసుకువస్తారో, (అది కూడా మూడు రోజుల ముందు వచ్చినదై ఉండాలి) వారు 14రోజుల పాటు ఇంట్లో క్వారంటైన్ లో ఉండాలి.

వ్యాపార విషయాల నిమిత్తం ప్రయాణించే వారికి( కరోనా నెగెటివ్ రిపోర్ట్ ఉంటే) హోమ్ క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదు. అది కూడా రిటర్న్ టికెట్స్ ఉన్నట్టయితే మాత్రమే.

కరోనా నెగెటివ్ రిపోర్ట్ ఉన్న ప్రయాణీకులకి ఏ సమయంలోనైనా టెస్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. యాంటిజెన్ రాపిడ్ టెస్ట్ ద్వారా ఈ టెస్ట్ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news