డిసెంబర్‌ 02 బుధవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

డిసెంబర్‌-2- కార్తీకమాసం- బుధవారం.

మేషరాశి: ఈరోజు కుటుంబ జీవితం సమస్యలు !

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. పిల్లల నుంచి నిరుత్సాహకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులకు విద్యారంగంలో సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబ జీవితం ఒత్తిడితో ఉంటుంది. మీ కిష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీబుధకౌశిక రామరక్షా స్తోత్రం పారాయణం చేయండి.

todays horoscope

వృషభరాశి ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈ రోజు సంతోషంగా ఉంటారు. పనులు సాఫీగా సాగిపోతాయి. దీనివల్ల మనశ్శాంతిగా ఉంటారు. రాజకీయ రంగంలో చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. దీనివల్ల భవిష్యత్‌లో ప్రయోజనం పొందుతారు. ఈరోజు పరీక్షలలో విజయం మీకు లభిస్తుంది. పెద్దల సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి

మిథునరాశి: ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది !

ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ రోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఏదైనా పోటీలో పిల్లల విజయ వార్తలను వింటారే. వ్యాపారంలో నూతన ఒప్పందాలు లాభాలను అందుకుంటారు. కుటుంబం నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. అనుకోని అతిథులు ఇంటికి వస్తారు. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది.

పరిహారాలు: కార్తీకమాస ఉపవాసం, దేవాలయ సందర్శనం చేయండి.

కర్కాటకరాశి: ఈరోజు సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది !


ఈరాశి వారికి అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. ఈరోజు మీ సోదరుడు సోదరీమణుల నుంచి సహకారం లభిస్తుంది. జీవనోపాధిలో వృద్ధి సాధిస్తారు. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైవాహికంగా జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః విష్ణు సంబంధిత ఆలయాలలో దీపారాధన, దానధర్మాలు చేయండి.

సింహరాశి: ఈరోజు విజయాన్ని అందుకుంటారు !

 ఈరోజు నూతన ప్రణాళికలు వేసుకుంటారు. ఈ రోజు కుటుంబంలో పిల్లలతో సమయాన్ని గడుపుతారు. కుటుంబ జీవితంలో విజయాన్ని అందుకుంటారు. నూతన ఆదాయ వనరులు మీకు మీరు సృష్టించుకుంటారు. మీ మాటలు, చేతల ద్వారా గౌరవం పొందుతారు. విదేశాల నుంచి సానుకూల ఫలితాలను అందుకుంటారు. మీకిష్టమైన వ్యక్తి నుంచి శుభవార్త వింటారు. ఈ రోజు వైవాహిక జీవితం బాగుంటుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీగణపతి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

కన్యరాశి: ఈరోజు అనేక సమస్యల నుంచి విముక్తి !

ఈరోజు అనుకూల ఫలితాలు. ఈ రోజు మీరు అనేక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఆఫీస్‌లో మీపై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో కొనసాగుతున్న ప్రయత్నాల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. పిల్లల వైపు నుంచి సంతృప్తికరమైన శుభవార్త పొందుతారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః పేద ప్రజలకు దుప్పట్లు, కప్పుకునే బ్లాంకెట్లు ఇవ్వండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది.

 

తులరాశి: ఈరోజు మీ కీర్తి పెరుగుతుంది !

ఈరోజు అనుకూల ఫలితాలు. వ్యాపారంలో నూతన అవకాశాల నుంచి లబ్ది పొందుతారు. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. శుభకరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కుటుంబ సభ్యుల ఆనందం పెరుగుతుంది. ఆర్థికలావాదేవీల వల్ల ప్రయోజనాలు పొందుతారు. శుభకార్య సంబంధమైన ఖర్చులు రావచ్చు. ప్రయాణం చేస్తారు. దీనవల్ల లాభాలు పొందుతారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీశివాభిషేకం చేయండి. మంచి ఫలితం ఉంటుంది.

వృశ్చికరాశి: ఈరోజు మీక అదృష్టం కలసి వస్తుంది !

 ఈరోజు వ్యాపార లావాదేవీలు జాగ్రత్త. రిస్క్‌ తీసుకుని పెట్టే పెట్టుబడుల వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. దేవాలయాలను సందర్శించే అవకాశం. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఆందోళన ఉంటుంది. ఆఫీస్‌లో మీరు ఎదురుకుంటున్న సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో నూతన ఆదాయ వనరులు నుంచి లబ్ది పొందుతారు. వైవాహికంగా నిరాశజనకంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీ అష్టోతరం చదవి, అమ్మవారికి దీపారాధన చేయండి.

ధనస్సురాశి: రోజు భాగస్వామ్య వ్యాపారాలకు ఇబ్బందులు !

 ఈరోజు మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారంలో ఇబ్బందులు రావచ్చు జాగ్రత్త. మీ భార్య తరుపు వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వైవాహికంగా సంతోషకరమైన రోజు ఈరోజు.

పరిహారాలుః శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మకరరాశి: ఈరోజు అనుకూల ఫలితాలు !

ఈరోజు ఇంటా, బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ, ఆర్థిక విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆఫీస్‌లో నూతన ప్రయత్నాలు ఫలవంతమవుతాయిమీ తోటి ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు  ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి.వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శివుడికి తేనేతో అభిషేకం చేయించండి. అనుకూల ఫలితాలు పొందండి.

కుంభరాశి: ఈరోజు సోదరుల వల్ల ప్రయోజనాలు !

ఈరోజు మిశ్రమ ఫలితాలు. ఈరాశి విద్యార్థులకు అనేక అవకాశాలు లభిస్తాయి. మిత్రులతో జాగ్రత్త. సోదరుల వల్ల ప్రయోజనాలు పొందుతారు. వారితో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారంలో పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు. వైవాహికంగా ఆనందంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీకాలభైరవాష్టకం పారాయణం చేయండి.

మీనరాశి: ఈరోజు ఆనందంగా ఉంటారు !

ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. విద్యార్థులకు భవిష్యత్తలో నూతన అవకాశాలు లభిస్తాయి. దేవాలయాలకు, క్షేత్రాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈరోజు దానధర్మాలకు ధనాన్ని వెచ్చిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీ దేవిని ఆరాధించండి.

 

-శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news