ఎన్నికలు జరుగుతుంటే పిక్నిక్ కి వెళ్తావా రాహుల్: ఆర్జెడి ఫైర్

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పనితీరు విషయంలో ఇప్పుడు ఆర్జెడి సీరియస్ గా ఉంది. కాంగ్రెస్ పార్టీ పనిచేసిన తీరుపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) నాయకుడు శివానంద్ తివారీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేసారు. ఆర్జేడీ 75 సీట్లు దక్కించుకున్నప్పటికీ, అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారం చేపట్టలేదు. కాంగ్రెస్ కేవలం 19 సీట్లను గెలుచుకోగలిగింది.

బీహార్ ఎన్నికల కోసం అందరూ ప్రచారం చేస్తుంటే రాహుల్ గాంధి సిమ్లాలో పిక్నిక్ కి వెళ్తాడా…? అని ఆయన మండిపడ్డారు. ఒక పార్టీని అలా ముందుకు నడిపిస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నడుస్తున్న విధానం బిజెపికి అనుకూలంగా మారుతుంది అని ఆయన ఆరోపించారు. వారు 70 మంది అభ్యర్థులను నిలబెట్టారు, కాని 70 బహిరంగ ర్యాలీలు కూడా నిర్వహించలేదని ఆరోపించారు.