హిందూమతంపై పాస్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు…!

నలుగురిలో మాట్లాడే సమయంలో మతం విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాని కొంత మంది మాత్రం విచక్షణ మరచి మాట్లాడుతూ ఉంటారు. తాజాగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావు పేట లో హిందూ మతం పై అనుచిత వ్యాఖ్యలు చేసాడు ఒక చర్చి ఫాస్టర్ క్రిస్టియన్ దినకర్. ఫాస్టర్ పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. అరెస్టు చేయాలని భారీ ఆందోళన చేపట్టారు.

జాతీయ రహదారిపై రాస్తా రోకో కి దిగారు. ఆదివారం సందర్భంగా చర్చి నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ… హిందు మతాన్ని అవహేళన చేసే విధంగా అవమానించే విధంగా మాట్లాడుతూ వివాదం రేపారు. దీనితో చర్చికి వెళ్ళిన ఇతరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు.