బండి సంజయ్, అక్బరుద్దీన్ ‌ల‌పై కేసు న‌మోదు

-

గ్రేటర్ ఎన్నికలపై పోలీసులు నిఘా పెంచారు. నేత‌ల ప్ర‌చార తీరును నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్న వారిపై, సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు పోస్టులు చేస్తున్నవారిపై ఆరా తీస్తూ కేసులు న‌మోదు చేస్తున్నారు. ఇటీవ‌ల ప్రచారంలో రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేసిన ఇద్ద‌రు ముఖ్య‌నేత‌ల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప్రముఖుల సమాధులు, పవిత్ర కట్టడాలను కూల్చివేస్తామన్న నేతలపై కేసులు ఫైల్ అయ్యాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు సుమోటో కింద కేసులు న‌మోదు చేశారు.

ఇటీవల గ్రేట‌ర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చెరువుల్లో అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చి వేస్తున్న ప్ర‌భుత్వం.., హుస్సేన్ సాగ‌ర్‌లో ట్యాంక్‌బండ్ పై ఉన్న ఎన్టీఆర్ ఘాట్, పీవీ ఘాట్‌లను కూల్చివేయాల‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. 4700 ఎక‌రాలున్న హుస్సేన్‌సాగర్ 700 వంద‌ల ఎక‌రాల‌కు కుచించుకు పోయింద‌న్నారు. అక్బ‌రుద్దీన్ వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజయ్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. మీరు ఎన్టీఆర్ ఘాట్‌, పీవీ ఘాట్‌ల‌ను కూల్చివేసిన రెండు గంట‌ల్లోనే దారుస్సలాంను కూల్చేస్తామన్నారు. ఇద్ద‌రి నేత‌ల వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రెండ్రోజుల ఎన్నికల ప్రచార సమయంలో నాయకులను క్షుణ్ణంగా గమనిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news