సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కు ఊరట..

ఉద్యోగులకి ఇచ్చే జీతాల విషయంలో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అదేంటంటే  ఏపి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన మార్చి, ఏప్రిల్ నెల జీతాల మీద వడ్డీ చెల్లించాలన్న ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మీద సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. వడ్డీ సైతం చెల్లించాలని  హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. అయితే జీతాలు చెల్లించేందుకు తాము సిద్ధమేనని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు.

రాష్ట్ర వాదనతో సంతృప్తి చెందిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన  ఉత్తర్వులను నిలుపుదల చేతూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కారణంగా అందరికీ సమస్యలు తలెత్తాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. వడ్డీ ఆశించడం సమంజసం కాదని,  రాష్ట్రంపై భారం వేయడం సరికాదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దీంతో ఉద్యోగులకి జీతం వరకు చెల్లించే అవకాశం కనిపిస్తోంది. దీని మీద ప్రభుత్వం ఎప్పుడు ఎలా ? చెల్లిస్తుంది ? వేచి చూడాలి మరి.