షాకింగ్: 2022 వరకు వ్యాక్సిన్ సామాన్యులకు లేదు: ఎయిమ్స్

కరోనా వైరస్ వ్యాక్సిన్ షాట్ కోసం సాధారణ ప్రజలు 2022 వరకు వేచి ఉండాల్సి ఉంటుందని దేశంలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. కరోనావైరస్ వ్యాక్సిన్ భారత మార్కెట్లలో సులభంగా లభించడానికి సంవత్సరానికి పైగా పడుతుందని ఎయిమ్స్ డైరెక్టర్ ప్రక్కటించారు. సాధారణ ప్రజలకు రావాలి అంటే ఏడాది కంటే ఎక్కువగా వేచి ఉండాలని అన్నారు.

ఇండియాలో జనాభా ఎక్కువగా ఉంది కాబ్బట్టి వ్యాక్సిన్ సేకరణ విషయంలో సమయం పడుతుంది అని ఆయన చెప్పారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భారతదేశానికి ఎదురయ్యే సవాళ్ళ గురించి అడిగినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. దేశంలో మారుమూల ప్రాంతాలకు ఏ ఇబ్బందులు అందించడం అతిపెద్ద సవాలు” అని ఆయన అన్నారు. చా సున్నితంగా వ్యాక్సిన్ విషయంలో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అని ఆయన వివరించారు.