అగ్ర హీరోకి కరోనా… బిగ్ బాస్ షూట్ వాయిదా…?

సల్మాన్ ఖాన్ వ్యక్తిగత డ్రైవర్ మరియు ఇద్దరు సిబ్బంది కరోనా వైరస్ బారిన పడటంతో సల్మాన్ హోం ఐసోలేషన్ కి వెళ్ళాడు. తన కుటుంబంతో పాటు రాబోయే 14 రోజులు ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. సిబ్బందిని మొత్తం ముంబై ఆసుపత్రిలో జాయిన్ చేయించాడు. కరోనా వైరస్ బారిన పడిన సిబ్బంది గురించి సల్మాన్ ఖాన్ తెలుసుకున్న వెంటనే, వారికి అవసరమైన వైద్య సహాయం అందేలా చూసుకున్నాడు.

salman
salman

సలీం ఖాన్ మరియు సల్మా ఖాన్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది. దీనిని రద్దు చేసే అవకాశం ఉంది. సల్మాన్ ఖాన్ తన కుటుంబంతో కలిసి పన్వెల్ లోని తన ఫామ్ హౌస్ కి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం, సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 14 ను నిర్వహిస్తున్నారు. దీనితో ఆయన షూటింగ్ వాయిదా పడే అవకాశం ఉంది.