ఘోర రోడ్డు ప్రమాదం.. తీవ్ర విషాదం..!

అతివేగం రోడ్డు నిబంధనలు పాటించక పోవడం వెరసి ఎన్నో ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రోడ్డు ప్రమాదాలలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే మరెంతోమంది జీవచ్ఛవాలుగా మారుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో తరచుగా ఘోర రోడ్డు ప్రమాదాలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే గుజరాత్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సురేంద్రనగర్ లో అతి వేగంగా దూసుకు వస్తున్న డంపర్ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో కారు అక్కడికక్కడే పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ఇక ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 7 గురూ ప్రయాణిస్తుండడంతో… ఇప్పటికే తీవ్ర గాయాలపాలై ఎటూ కదలలేని స్థితిలో కారులో ఉన్న వారు సజీవదహనం అయిపోయారు వేగంగా 7గురు సజీవదహనం కావడం సంచలనం గా మారిపోయింది. ఏడుగురు కళ్ళముందే చూస్తుండగా సజీవదహనం కావడం తో.. విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.