ప్రేమకు మరో ప్రణయ్ బలి.. కంట తడి పెట్టిస్తోన్న చివరి మాటలు

ప్రేమకు మరో ప్రణయ్ బలి అయ్యాడు. అయితే ఇప్పటి దాకా ప్రణయ్ లు పెళ్లి చేసుకున్న అమ్మాయిల తండ్రుల వలన చనిపోతే ఈ ప్రణయ్ మాత్రం ప్రెమిన్చీన అమ్మాయి చేసిన మోసం తట్టుకోలేక మరణించాడు. హైదరాబాద్ కు చెందిన ప్రణయ్ తన ప్రియురాలు మోసం చేసింది అని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే యూట్యూబర్ కూడా కావడంతో ఆమె తనను ఎలా మోసం చేసిందో ? ఎంతలా వాడుకుందో ? ఆమె ఎలాంటిదో మొత్తం అన్నీ ఆధారాలతో సహా రిలీజ్ చేసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు.

కెనడాలో తను నివాసం ఉంటున్న ఇంట్లోనే నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. అఖిల అనే అమ్మాయిని ప్రేమించానని కానీ ఆమె తనను మోసం చేసి మాజీ ప్రియుడితో ఆమె చాటింగ్ చేస్తుంది అని, తాను వద్దు అని చెప్పినా సరే ఆమె మాత్రం ఆగలేదు అని అయితే ఆ విషయం వంక పెట్టుకుని మరికొడ్డి రోజుల్లో పెళ్లి కావాల్సి ఉన్న తనను వదిలేసి పారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.  ఈ యూట్యూబ్ వీడియోలను మీ కోసం అందిస్తున్నాం. ఇక తన అవయవాలను దానం చేయాలని, తన శరీరాన్ని పరిశోధనలకు వాడుకోవాలని కూడా సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు.