బ్రేకింగ్: పోలవరం ప్రాజెక్ట్ వద్ద అలజడి

పోలవరం ప్రాజెక్ట్ వద్ద అలజడి రేగింది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఒక యువకుడు మరణించడం వివాదంగా మారింది. ప్రమాదవశాత్తు కాంక్రీటు కర్సర్ లో పడి కార్మికుడు మృతి చెందాడు. మృతి చెందిన కార్మికుడి మృతదేహం వెలికితీసి పోస్టుమార్టం కు తరలించారు. ప్రమాదానికి గురైన కార్మికుడి విషయంలో నిర్లక్ష్యం వహించారని ఆగ్రహంతో నిన్న రాత్రి బస్సు పైన, పలు వాహనాల పైన కార్మికులు దాడికి దిగారు.

దీనితో పోలవరం ప్రాజెక్ట్ వద్దకు పోలీసులు భారీగా చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను ఏర్పాటు చేసారు. దీనితో తాత్కాలికంగా పోలవరం పనులు నిలిచిపోయాయి. స్పిల్ వే పనులు చేపట్టేందుకు కార్మికులు ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.