గంటా శ్రీనివాసరావుకి షాక్ ఇస్తున్న బ్యాంకు…!

గత కొంత కాలంగా రాజకీయంగా సైలెంట్ గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి ఇండియన్ బ్యాంకు షాక్ ఇవ్వడానికి రెడీ అయింది. నవంబర్ 25 న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వ్యాపార భాగస్వామి గా ఉన్న ప్రత్యూష కంపెనీ ఆస్తుల వేలం వేయనున్నారు. మొత్తం 248 కోట్ల రూపాయలు ఇండియన్ బ్యాంకు చెల్లించాల్సి ఉండగా గతంలోనే ఆయన ఆస్తులు స్వాధీనం చేసుకుంది.

 

హైదరాబాద్ బ్రాంచ్ ఇండియన్ బ్యాంక్… ఈ వేలం వేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తో పాటు అతనితో భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రత్యూష కంపెనీకి చెందిన పలువురు సభ్యుల ఆస్తుల వేలం వేయడానికి రెడీ అయ్యారు. అయితే దీనిపై ఇంకా గంటా శ్రీనివాసరావు స్పందించలేదు.