టీఆర్ఎస్- బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం..!

-

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. చాలా చోట్ల పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు పలుచోట్ల ఉద్రికతలకు దారి తీస్తున్నాయి. పలుపార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ఘర్షణలకు దిగుతున్నారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా మాదాపూర్‌లో టీఆర్ఎస్ నాయకులు దొర్జన్యానికి పాల్పడుతున్నారని స్థానిక బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

MADHAPUR
MADHAPUR

పోలింగ్ బూత్ వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్లరకు డబ్బులు పంచుతుండగా మాదాపూర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణ యాదవ్ రెడ్ హ్యండెడ్‎గా పట్టుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా టీఆర్ఎస్ నాయకులకే మద్దతు తెలుపుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.

అయితే పోలింగ్ లో భాగంగా మాదాపూర్‌లో టీఆర్ఎస్ నాయకులు దొర్జన్యానికి పాల్పడుతున్నారని స్థానిక బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసుల సాయంతో పోలింగ్ బూత్ లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. దాంతో టీఆర్ఎస్ బీజీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నాయకులకు మాదాపూర్ పోలీసులు సాయం చేస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు వారిని చెదరగొట్టి ప్రశాంతంగా పోలింగ్ జరిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ ఏయే ప్రాంతాల్లో.. ఏయే పార్టీల కార్యకర్తలు, నేతల మధ్య గొడవలు జరిగాయో ఓ లుక్కేద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news