విస్కీ తాగుతూ ఫోటోకి ఫోజిచ్చిన పాయల్..

ఆర్ ఎక్స్ 100 సినిమాలో అందాలు ఆరబోసిన పాయల్ రాజ్ పుత్, ఆ తర్వాత చాలా చిత్రాలు చేసింది. కానీ ఏదీ సరైన గుర్తింపుని తీసుకురాలేకపోయింది. ప్రస్తుతం ఆహా కోసం చేసిన అనగనగా ఓ అతిధి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఐతే తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు తాము మద్యం సేవిస్తామని బయటకి చెప్పరు. చాలా మందికి ఆ అలవాటు ఉన్నప్పటికీ బయటకి మాత్రం చెప్పరు. కానీ పాయల్ రాజ్ పుత్, విస్కీ తాగుతూ ఫోజిచ్చింది.

టేబుల్ ముందు విస్కీ బాటిల్ పెట్టుకుని గ్లాసులో పెగ్గు పోసుకుని తాగున్నట్టు ఫోటోకి ఫోజిచ్చింది. సినిమా కోసం హైదరాబాద్ లో ఉన్నపాయల్ రాజ్ పుత్, ఇలాంటి ఫోటో షేర్ చేయడంతో అందరూ షాకవుతున్నారు. ఇదంతా విస్కీ ప్రమోషన్లో భాగంగానే చేసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మొదటి సినిమాలో బోల్డ్ గా కనిపించిన పాయల్, నిజ జీవితంలోనూ అలాగే ఉంటుందని నిరూపించింది.

https://www.instagram.com/p/CHdEBDIHBXF/?utm_source=ig_web_copy_link