రసకందాయంలో తమిళ రాజకీయాలు..రంగంలోకి సినీ,రాజకీయ ఉద్దండులు..!

-

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఆసక్తిగా ఉంటాయి..తమిళనాడులో సినిమా, రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంది..సినిమా హీరోలు సొంత పార్టీలు స్థాపించి ప్రజల్లోకి వెళ్లి రాజకీయాల్లో అత్యంత క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు..ఎంజీఆర్,కరుణానిధి, జయలలిత వరకూ అందరూ సినీరంగం నుంచి వచ్చిన వారే..ఎంజీఆర్ మొదలు విజయ్ కాంత్, కమల్ హాసన్ వరకూ సొంత పార్టీలు స్థాపించిన వారే..దక్షిణ భారత్‌లో ఏపీ రాజకీయల తర్వాత ఎక్కువ ఇంట్రస్ట్ గా రాజకీయాలు తమిళనాడువి మాత్రమే..రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల ఆధిపత్యం ఉంటుంది..డీఎంకే లేదా ఏఐడీఎంకే ఈ రెండు పార్టీలే తమిళ రాజకీయాలను శాసిస్తాయి..ఎప్పుడు కరుణానిధి, జయలలిత మధ్య రాజకీయ యుద్ధం జరుగుతూనే ఉండేది..ఇద్దరి మధ్య పాము ముంగిస రాజకీయ వార్ జరిగేది.

ఇద్దరు పార్టీ అధ్యక్షులు మరణించడంతో తమిళనాడు రాజకీయంలో సంచలన మార్పులు వచ్చాయి..అధికారంలో ఏఐడీఎంకే పార్టీ పగ్గాలు జయ లలిత స్నేహితురాలు శశికల బాధ్యతులు చేపట్టిండి..వెంటనే పన్నీరు సెల్వంపై వేటు వేసి తనకు నమ్మిన బంటు పలనీ స్వామిని సీఎం పీఠం ఎక్కించారు..పార్టీలో ఉన్న అసంతృప్తులపై శశికల నిర్ధక్షినంగా అణచివేసింది..రాష్ట్రంలో బీజేపీ బలపడడానికి అవకాశాలు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది..ఒకానునోక సమయంతో మోడీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనేల వ్యవహరించింది.. చివరికి రాజకీయ కారణాలు ఏవైనప్పటికి అవినీతి ఆరోపణల కేసులో జైలు జీవితం గుడుపుతుంది..వచ్చే జనవరిలో శశకల విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తుండటంతో తమిళనాడులో మళ్లీ ఎన్నికల రాజకీయ వేడి మొదలైంది..రాజకీయ సమీకరణాలు జోరందుకున్నాయి.
అన్నాడీఎంకే నుంచి సీఎం అభ్యర్థి ఎవరనే అంశం తాజాగా తెరపైకొచ్చింది..అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనేందుకు ఇటీవలే అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం నిర్వహించారు..ఈ సమావేశంలో పలని స్వామి, పన్నీరు సెల్వాం మధ్య వాగ్వాదం జరిగింది..తనకే అవకాశం ఇవ్వాలని పన్నీర్‌సెల్వం డిమాండ్ చేశారు..ఈ పరిణామంతో ఇరు వర్గాల నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు..మరోవైపు ప్రధాన ప్రతి పక్షం అయినా డీఎంకే అన్నాడీఎంకేలో నెలకొన్న ఈ పరిణామాలను ఆసక్తిగా పరిశీలిస్తోంది..ప్రతిపక్ష డీఎంకేలో సీఎం అభ్యర్థిపై ఎలాంటి తర్జనభర్జన లేదు..2021లో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే నుంచి సీఎం అభ్యర్థిగా స్టాలిన్ నిలవనున్నారు..

ఇప్పుడు డీఎంకేలో మళ్లీ అలిగిరి అంశం తెరపైకి వచ్చింది..పార్టీలో మొదటి నుంచి స్టాలిన్‌ నాయకత్వాన్ని వ్యతిరేకించిన అలిగిరి..ఇప్పుడు కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్ననట్లు వార్తలు వస్తున్నాయి..ఒక వేళ అలిగిరి పార్టీ పెడితే అది డీఎంకే పార్టీకి భారీ నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి..అది బీజేపీకి, ఏఐడీఎంకు మేలు చేసే అవకాశం ఉంది..స్టాలిన్‌ సీఎం కావాలన్ననేరవేరదంటున్నారు విశ్లేషకులు..డీఎంకేకు పార్టీ పరంగా ఎలాంటి తలనొప్పులు లేకపోవడం అన్నాడీఎంకేతో పోల్చుకుంటే ఆ పార్టీకి కలిసొచ్చే అంశం..పొత్తులపరంగా కూడా డీఎంకే స్పష్టమైన వైఖరితో ఉంది..ప్రస్తుతం కొనసాగుతున్న కాంగ్రెస్‌తో కలిసే దాదాపు వచ్చే ఎన్నికల్లో డీఎంకే బరిలో నిలవనుంది..ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో..సీఎం అభ్యర్థి ఎంపికపై పన్నీరు సెల్వం, పళని స్వామి మధ్య సయోధ్య కుదరని పక్షంలో అన్నాడీఎంకేలో చీలిక వచ్చే అవకాశమూ లేకపోలేదు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది..ప్రస్తుతం తమిళనాడులో బీజేపీ రెండు ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. అన్నాడీఎంకేతో కలిసి నడవాలని తమిళనాడు బీజేపీలోని కొందరు భావిస్తుంటే..మరికొందరు మాత్రం మాస్‌లో ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్‌తో కలిసి నడవాలని కేంద్ర పెద్దలకు సంకేతాలు పంపినట్లు తెలుస్తుంది..తమిళనాడులో బీజేపీ ఎవరితో కలిసి ముందుకెళ్లనుందన్న అంశం కూడా ఎన్నికల సమీపించే సమయంలో చర్చనీయాంశంగా మారే అవకాశముంది..బీహార్‌లో అనుసరించిన రాజకీయ వ్యూహాన్ని తమిళనాడులో అమలు చేసయాలని..అధికారపార్టీతో పొత్తుపెట్టుకోని పార్టీని బలోపేతం చేయాలి..అందులో భాగంగానే త్వరలోనే అమిత్‌ షా తమిళనాడులో పర్యటించనున్నారని విశ్లేషకులు అంటున్నారు..తమిళనాడులో మరో నటుడు కమల్‌హాసన్ ఇప్పటికే పార్టీని స్థాపించి..సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారు..తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం సొంత పార్టీ ఏర్పాటుపై ఊగిసలాట ధోరణిలో ఉన్నారు. తాజాగా తమిళనాడు మరో అగ్ర హీరో హీరో విజయ్ పార్టీ పెట్టనున్నారంటూ జోరుగా పుకార్లు వస్తున్నాయి. తాను నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ ‘విజయ్ మక్కల్ అయిక్కమ్’ ను పార్టీగా మార్చుతున్నారని ప్రచారం జరుగుతోంది..మొత్తంగా చూస్తే..తమిళనాడులో 2021లో జరగబోయే ఎన్నికలు గతంతో పోల్చితే ఆసక్తికర పొత్తులకు, ఊహించని రాజకీయ ఎత్తుగడలకు సాక్ష్యంగా నిలవనున్నాయనడంలో సందేహం లేదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

Read more RELATED
Recommended to you

Latest news