పెళ్లిళ్లు, అంత్యక్రియలకు “లాక్ డౌన్ 3.0” మార్గదర్శకాలు..!

-

కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. పెళ్లిలు, శుభకార్యాలకు సంబధించి కూడా పలు మార్గదర్శకాలను ప్రకటించింది.

పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు 50 మంది మించి హాజరు కావడానికి నిరాకరించింది. అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరు కావద్దని తెలిపింది. అక్కడ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది.  భౌతిక దూరం పాటిస్తూ.. ఐదుగురికి  మించి ఒకేచోట ఉండరాదని ఆదేశాలు జారీ చేసింది. కాగా, . ఇప్పటివరకు పెళ్లిళ్లకు కేవలం 10 లేదా 20 మందిని మాత్రమే అనుమతించేవాళ్ళు.

అలాగే లాక్ డౌన్ అనంతరం తెరుచుకోనున్న అని విద్యాసంస్థలకు కూడా కేంద్రం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. షిప్టుల వారీగా క్లాసులు, నూతన సిట్టింగ్ అరెంజ్‌మెంట్ చేయడం, క్యాంటీన్, హాస్టళ్లలో పలు నూతన పద్ధతులు పాటించడం తప్పనిసరి చేసింది. అలాగే ఉదయం పూట సమావేశాలు సహా, క్రీడా కార్యక్రమాలను కూడా రద్దు చేయాలని పేర్కొంది. అయితే కొన్ని సడలింపులు ప్రకటించినప్పటికీ రెడ్ జోన్లలో మాత్రం నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నట్ట కేంద్రం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news