ఇక డబ్బుంటే ఎవరైనా స్పేస్ లోకి.. నాసా కీలక ప్రయోగం సక్సెస్ !

-

నలుగురు వ్యోమగాములు ఆదివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి స్పేస్‌ ఎక్స్ క్రూ డ్రాగన్ “రేసేలీన్స్” నుండి విజయవంతంగా కక్ష్యలోకి చేరుకొన్నారు. ముగ్గురు అమెరికన్లు – మైఖేల్ హాప్కిన్స్, విక్టర్ గ్లోవర్ మరియు షానన్ వాకర్ – మరియు జపాన్ దేశపు వ్యోమగామి సోచి నోగుచి ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి రాత్రి 7:27 గంటలకు దీనిని ప్రయోగించారు.

తద్వారా ఈ రైడ్ల కోసం రష్యాపై అంతర్జాతీయంగా ఆధారపడుతూ వస్తోన్న ఒక దశాబ్దపు శకం ముగిసింది. ఇక ఈ ప్రయోగం మీద అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లు ట్విట్టర్ ద్వారా అభినందించారు. ఓల తన భార్య కరెన్‌తో కలిసి ఈ ప్రయోగానికి హాజరైన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దీనిని “అమెరికాలో మానవ అంతరిక్ష పరిశోధనలో కొత్త శకం” అని పేర్కొన్నారు. భవిష్యత్తులో, ప్రభుత్వం నడిపే అంతరిక్ష నౌకల మీద ఆధారపడే బదులు, నాసా వ్యోమగాములు లేదా తగినంత డబ్బు ఉన్న ఎవరైనా వాణిజ్య రాకెట్‌ లో టికెట్ కొనుగోలు చేయవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news