అధికార పార్టీ దెబ్బకు స్వీట్ షాప్ పేరు మార్చాడు…!

ముంబైలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ముంబైలోని ప్రసిద్ధ కరాచీ  స్వీట్‌మీట్ షాపు యజమాని శివసేన నాయకుడి బెదిరింపుల నేపథ్యంలో ‘కరాచీ’ అనే పదాన్ని తన దుకాణం సైన్ బోర్డ్ నుంచి తొలగించాడు. దీనిపై షాప్ యజమాని స్పందించాడు. “ఈ సమస్యతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను నా న్యాయవాదులను సంప్రదించాను. రాబోయే రోజుల్లో నేను సైన్ బోర్డుల నుండి “కరాచీ” పేరును మార్చవచ్చు లేదా మార్చకపోవచ్చు”అని చెప్పాడు.

దుకాణం పేరు నుండి ‘కరాచీ’ అనే పదాన్ని తొలగించమని శివసేన నాయకుడు ఒకరు దుకాణ యజమానిని బెదిరించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది వివాదంగా మారింది. శివసేన నాయకుడు నితిన్ నందగావ్కర్ తన దుకాణానికి వచ్చి పేరు మార్పు కోరినట్లు చెప్పారు. “మేము కరాచీ అనే పదాన్ని ద్వేషిస్తున్నాము … ఇది పాకిస్తాన్లో ఉగ్రవాదుల ప్రదేశం కాబట్టి మీరు ఈ పేరును మార్చుకోవాలి” అని హెచ్చరించాడు.