క్రేజీ లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఆచార్య సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ తప్పిస్తే ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు. అందులోనూ చిరంజీవిని చూపించీ చూపించనట్టుగా చూపించారు. ఆచార్య సినిమాలో చిరంజీవి లుక్ ఎలా ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై అప్డేట్ రావడానికి టైమ్ పట్టేలా ఉన్నప్పటికీ, తాజాగా బయటకి వచ్చిన ఫోటోలు అభిమానులని ఆకట్టుకున్నాయి.

తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో వస్తున్న సామ్ జామ్ టాక్ షో కోసం వచ్చిన మెగాస్టార్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. సమంత హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షోకి మెగాస్టార్ అతిధిగా వస్తున్నారు. ఈ ఫోటోల్లో మెగాస్టార్ అల్ట్రా స్టైలిష్ గా కనిపించడంతో ఆచార్యలో మెగాస్టార్ లుక్ అదిరిపోనుందని అర్థం అవుతుంది. ఇటీవలే ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభించాలనుకున్న చిరంజీవి, తప్పుడు కరోనా టెస్ట్ కిట్ వల్ల పాజిటివ్ అని రావడంతో ఊరుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత రెండు మూడు టెస్టుల్లో నెగెటివ్ అని తేలడంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు.