మా ట్రంప్ కి అన్యాయం చేసారు: అమెరికాలో నిరసనలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు శనివారం వాషింగ్టన్ లో ర్యాలీ నిర్వహించారు. ఎన్నికలను దొంగతనం చేసారు అని వారు ఆరోపణలు చేసారు. వర్జీనియాలోని కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఎన్నికల్లో ట్రంప్ ని మోసం చేసారని, వారికి అనుకూలంగా ఫలితం ఇచ్చారు అంటూ వారు ఆరోపించారు. డెమొక్రాట్ జో బిడెన్‌ ను విజేతగా ప్రకటించిన వారం తరువాత… ట్రంప్‌ కు మద్దతుగా ప్రదర్శనలు ఇతర నగరాల్లో కూడా జరిగాయి.

trump
trump

నవంబర్ 3 ఓటింగ్ మరియు లెక్కింపు సందర్భంగా అవకతవకలు జరిగాయని ట్రంప్ ఆరోపణలు చేసారు. అయితే ఎన్నికల సంఘం దీనిపై స్పందించింది. అవి అన్ని తప్పుడు ఆరోపణలు అని పేర్కొంది. ఇక ఫ్లోరిడాలోని డెల్రే బీచ్‌ లో వందల మంది ప్రజలు కవాతు చేశారు. కొందరు “ప్రతి ఓటును లెక్కించండి” అని నిరసన చేయగా మరికొంత మంది ఓట్ల లెక్కింపులో తప్పు జరిగింది అని ఆరోపించారు.