కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా కీలక అడుగులు

ఏపీ ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా కీలక అడుగులు వేస్తోంది. స్టీల్ ప్లాంటు ఏర్పాటులో ఆసక్తి ఉన్న భాగస్వాములను ప్రభుత్వం ఆహ్వానించింది. జాయింట్ వెంచర్ పద్దతిన స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు భాగస్వాములకు ఆహ్వానం పలికింది. ఈ మేరకు వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్ లిమిటెడ్ పేరుతో గ్లోబల్ టెండర్లు జారీ అయ్యాయి. ఆసక్తిగా ఉన్న సంస్థలు ఆర్ ఎఫ్ పి సమర్పించాలని సూచించారు.

ఈ ప్రాజెక్టు కోసం ఎలాంటి వివాదాలు లేని 3500 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని టెండర్లల్లో ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ప్రతేడాది 2 టీఎంసీల నీరు, నిరంతరాయ విద్యుత్ సరఫరా, నాలుగు లైన్ల రోడ్డు సహా రైలు కనెక్టివిటీ కూడా ఉందని టెండర్లో వెల్లడించారు. కృష్ణ పట్నం, రామాయ పట్నం ఓడరేవులు స్టీల్ ప్లాంట్ సమీపంలో ఉన్నాయని వెల్లడించారు. ముడి సరుకు అందుబాటులో ఉన్న ప్రాంతాలు కూడా ఈ యూనిట్టుకు దగ్గర్లోనే ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.