అడుగు దూరంలో ఉనోళ్లు ఇంట్లోనే కూర్చుంటే.. ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఓటేశాడు..!

-

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ ఇప్పటికీ కూడా మందకొడిగా సాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఇక సాయంత్రం ఆరు గంటల లోపు కూడా ఓటింగ్ శాతం పెరుగుతుంది అన్న పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఓటర్లు ఇంటి నుంచి కాలు బయట పెట్టడం లేదు. ఓటు వేసేందుకు అస్సలు ఆసక్తి చూపడం లేదు. దీంతో పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే ఓట్లు సింగిల్ డిజిట్ కూడా దాటక పోవడం గమనార్హం.

అయితే నగరం నడిబొడ్డులో ఉన్నోళ్ళు ఇంట్లోనే కూర్చుంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏకంగా ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు ఇక్కడ ఒక యువకుడు. జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ శంకరయ్య కుమారుడు రిత్విక్ ప్రస్తుతం ఎంతోమంది యువతరానికి ఆదర్శంగా నిలిచాడు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఉన్నత చదువులను చదువుతున్న రిత్విక్.. ఓటు విషయంలో కూడా ఉన్నతంగానే ఆలోచించాడు. గతంలో జనవరి నెలలో కుటుంబాన్ని కలిసేందుకు రావాలి అనుకున్నాడు కానీ జీహెచ్ఎంసీ ఎన్నిక లు ఉన్నాయని తెలిసి అప్పుడు రాకుండా ఇప్పుడు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news