స్వగ్రామాలకు తెలుగు రాష్ట్రాల జవాన్ల మృతదేహాలు..నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.

జమ్మూకశ్మీర్‌ ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన..తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు..మృతి చెందిన జవాన్ల మృతదేహాలు వారి స్వగ్రామాలకు చేరుకున్నాయి..తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా కోమన్‌పల్లి కు చెందిన జవాన్‌ మహేశ్ మృతదేహం ఆయన స్వగ్రామానికి చేరుకుంది..చిత్తూరు జిల్లాకు చెందిన వీర జవాన్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భౌతికకాయం జిల్లాలోని ఐరాల మండలం రెడ్డి వారి పల్లికి చేరుకుంది..ఇవాళ మధ్యాహ్నం జవాన్ల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.. జవాన్ల చివరి చూపుల కోసం బంధువులు, స్నేహితులు తరలివస్తున్నారు.
ఉదయం 10గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది..కోమన్‌పల్లి శ్మశానవాటికలో సైనిక లాంఛనాలతో మహేష్ అంత్యక్రియలు నిర్వహించున్నారు..జమ్ముకశ్మీర్‌ కాల్పుల్లో వీరమరణం పొందిన తెలంగాణ జవాను ర్యాడ మహేశ్‌.. ప్రత్యేక విమానంలో భౌతికకాయాన్ని హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం మహేశ్‌ భౌతికకాయాన్ని ఆయన సొంత ఊరు నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు మండలం, కోమన్‌పల్లి గ్రామానికి తరలించారు. ఇవాళ సైనికలాంఛనాలతో వీరుడికి అంతిమసంస్కారాలు జరుగుతాయి..మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత అంత్యక్రియలకు హాజరవుతారు..మరోవైపు జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లాకు చెందిన వీర జవాన్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భౌతికకాయం జిల్లాలోని ఐరాల మండలం రెడ్డి వారి పల్లికి చేరుకుంది..మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అధికార లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జవాన్‌కు నివాళులర్పించేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు.