ప్రభాస్ సినిమా రీమేక్ తో బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ..?

రాక్షసుడు సినిమాతో ఓ మాదిరి విజయం అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఇంకా చిత్రీకరణలో ఉండగానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది. రాక్షసుడు హిట్ అయ్యాక, అదే సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేద్దామని భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఐతే ప్రస్తుతం మరో తెలుగు సినిమా రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఖాయమయ్యేలా కనిపిస్తుంది.

ప్రభాస్ కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఛత్రపతి సినిమాని బెల్లంకొండ హీరోగా హిందీలో రీమేక్ గా చేయనున్నారట. ఈ మేరకు బాలీవుడ్ నిర్మాణ సంస్థ బెల్లంకొండ తో సినిమా చేసేందుకు ముందుకు వచ్చిందట. తెలుగులో వరుస సినిమాలు తీస్తున్న బెల్లంకొండకి హిందీ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగే ఉంది. దాంతో నిర్మాతలు ఛత్రపతి సినిమాని రీమేక్ చేస్తారని సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన రానప్పటికీ ఫిలిమ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.