భార్యకు దొరికేస్తాడని రెండో అంతస్తు నుండి కిందకు దూకేశాడు !

ఏపీలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే భార్యను ఉండగానే ఆమెకు తెలీకుండా భర్త తన ప్రియురాలితో వేరు కాపురం పెట్టాడు. అయితే ఎప్పటి నుండో భర్త మీద అనుమానం ఉన్న ఆమె ప్రియురాలితో ఉన్న భర్తని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టు కోవడానికి ఆ ఇంటికి వెళ్ళడంతో భయపడిన సదరు భర్త రెండో అంతస్తు నుంచి కిందకు దూకి పారిపోయాడు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. తిరుపతికి చెందిన చంద్రమౌళి భార్య ఉండగానే వేరే యువతితో తిరుపతి పద్మావతి నగర్ లో ఒక అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు.

ఇతను డబ్బు ఆశ చూపించి పలువురు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆయన భార్య ఆరోపిస్తోంది. గతంలో కూడా ఒకసారి కాల్ మనీ కేసులో అరెస్టయిన చంద్రమౌళి ఇలాంటి ఎన్నో ఘోరాలు చేశాడని భార్య ఆరోపిస్తోంది. పద్మావతి నగర్ లోని ఇంట్లో తన ప్రియురాలి తో ఉండగా బంధువులతో కలిసి వచ్చిన భార్యను చూసి చంద్రమౌళి భయపడి రెండో అంతస్తు నుంచి కిందకు దూకి పారి పోయాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ అదే బిల్డింగ్ ముందు మౌన దీక్షకు దిగింది చంద్రమౌళి భార్య.