సక్సెస్‌ కోసం చెఫ్ గా మారిన దేవరకొండ బ్రదర్స్

వంట చెయ్యడం కొంతమంది కష్టమంటారు. మరికొంతమంది స్ట్రెస్‌ బస్టర్‌లా పనిచేస్తుంది అంటారు. కానీ దేవరకొండ బ్రదర్స్‌ మాత్రం వంట చేస్తే సూపర్‌ హిట్లు వస్తాయని నమ్ముతున్నారు. అందుకే అన్నయ్యకి స్టార్డమ్‌ సంపాదించిపెట్టిన వంటనే నమ్ముకుంటున్నాడు తమ్ముడు.

విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండకి ఫస్ట్ మూవీయే పెద్ద షాక్‌ ఇచ్చింది. ‘దొరసాని’ సినిమాలో ఆనంద్ యాక్టింగ్‌పై బోల్డన్ని విమర్శలొచ్చాయి. యాక్టింగ్‌ రాకపోయినా అన్నయ్య పేరు చెప్పుకుని ఇండస్ట్రీకి వచ్చాడని ట్రోల్ చేశారు. అయితే ఈ విమర్శలన్నిటికి సమాధానం చెప్పడానికి తమ్ముడు కూడా అన్నయ్యలాగే వంటలు చేస్తున్నాడు. విజయ్‌ దేవరకొండ ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా ఫస్ట్‌ హిట్‌ కొట్టాడు. ఫుడ్‌ట్రక్‌ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ మూవీతో విజయ్‌కి లేడీ ఫాలోయింగ్‌ కూడా వచ్చింది. ఇక ‘అర్జున్‌రెడ్డి’తో ఈ ఫాలోయింగ్‌ మరింత పెరిగిపోయింది. అందుకే తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ కూడా ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’ సినిమాతో చెఫ్‌గా మారిపోయాడు.

ఆనంద్ దేవరకొండ సెకండ్‌ మూవీ ‘మిడిల్‌క్లాస్‌ మెలోడీస్’ హోటల్‌ బిజినెస్‌ బ్యాక్‌డ్రాప్‌తో వస్తోంది. ఈ మూవీలో చెఫ్‌గా నటిస్తున్నాడు ఆనంద్. మరి అన్నయ్యకి స్టార్డమ్‌ తెచ్చి పెట్టిన వంటల కథ, తమ్ముడికి కూడా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుందా అన్నది ఈనెల 20న తేలిపోతుంది.