హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు.. ముగ్గురు స్పాట్ లోనే !

హైదరాబాద్ లో వరుస రోడ్డు ప్రమాదాలు టెన్షన్ పెడుతున్నాయి. నిన్న రాత్రి మాదాపూర్ సిగ్నల్ వద్ద ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాదాపూర్ సైబర్ టవర్ సిగ్నల్ వద్ద సిగ్నల్ జంప్ చేసి మరీ బులెట్ మీద వెళుతున్న భార్య భర్తలను బెంజ్ కార్ ఢీ కొట్టింది. ఈ క్రమంలో బైక్ ఉన్న గౌతమ్ దేవ్ అక్కడిక్కడే మృతి చెందగా భార్య శ్వేతకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. బెంజ్ కార్ ని కాశి విశ్వనాథ్ అనే వ్యక్తి నడిపినట్టు గుర్తించారు.

కారు నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమైన కాశి విశ్వనాథ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కార్ లో ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక మరో ప్రమాదం తుర్కయాంజల్ సమీపంలోని రాగన్నగూడా వద్ద సాగర్ రహదారిపై జరిగింది. యమహా ఫాసినో బైక్ ను కారు ఢీకొన్న ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మృతులు ఇద్దరూ తల్లి కొడుకు గా గుర్తించారు. ఇక కారులో ఉన్న ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెబుతున్నారు. సఫారీ కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. మృతులు రాగన్నగూడలోని జీవీఆర్ కాలనీలో నివాసముండే ప్రదీప్ రెడ్డి(19), చంద్రకళ(48)గా పోలీసులు గుర్తించారు.