యాక్సిడెంట్ : పెళ్లింట విషాదం.. ఇద్దరు మృతి 

ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక పెళ్ళింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ కి యాక్సిడెంట్ కాగా అందులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒంగోలు బైపాస్ రోడ్ లో ముందు వెళుతున్న లారీని పెళ్లి బృందంతో వెళ్తున్న టెంపో వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే  మృతి చెందారు.

వ్యానులో చిక్కుకున్న నలుగురిని బయటకు తీశారు పోలీసులు. ప్రమాదంలో  ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ గాయపడిన వారిని  హాస్పిటల్ కి తరలించారు. తిరుపతిలో వివాహం చేసుకుని తెనాలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అంటున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.