కరోనా రోగి ఒక్కసారి తుమ్మితే 1000 వైరస్ కణాలు..!

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్ ఎవరి దగ్గర నుండి ఎలా వ్యాపిస్తుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారికి ఇక వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలందరు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ వైరస్ కి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు మాస్కులు, ధరించి సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

corona person
corona person

ఇక కరోనా వైరస్ ప్రజలపై దాడి చేసి దాదాపు ఏడాది కావస్తుంది. అయినప్పటికీ ఇప్పటి వరకు కరోనా వైరస్ లక్షణాలు ఇవేనని చెప్పే సాహసం చేయలేకపోతున్నారు వైద్య నిపుణులు శాస్త్రవేత్తలు. ఇప్పటికీ కరోనా వైరస్ కొత్త లక్షణాలతో ప్రజలపై విరుచుకుపడుతుంది. తాజాగా శాస్త్రవేత్తలు చేస్తోన్న పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్ట్రియాలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న నగరాల్లో కరోనా రోగుల నుంచి నమూనాలను సేకరించి ఆస్ట్రియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో మరో కొత్త విషయం తెలిసిందే.

అయితే కరోనా‌ సోకిన వ్యక్తి తుమ్మినా..దగ్గినా ప్రమాదమేనని తేల్చింది. కరోనా సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు అతడి నుంచి మరో వ్యక్తికి సగటున 1,000 వైరస్‌ కణాలు వ్యాపిస్తాయని గుర్తించారు. దాదాపు 750 మంది కరోనా రోగుల నుంచి శాంపిళ్లను తీసుకుని ఈ విషయాన్ని తేల్చారు. హెచ్‌ఐవీ, నోరో వైరస్‌ల కన్నా కరోనా రోగుల నుంచి వైరస్‌ కణాల వ్యాప్తి ఎక్కువగా జరుగుతోందని తెలిపారు. కరోనా సోకిన వారు మాస్క్‌ ధరించడం, ఇతరులకు భౌతిక దూరం పాటించడంతో పాటు ఇంట్లో వెంటిలేషన్‌ సరిగ్గా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. అలా చేస్తే వైరస్‌ కణాల వ్యాప్తిని తగ్గించవచ్చని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news