భోజనానికి ముందు కాళ్ళు కడుక్కోవాలా ?

-

మన సంస్కృతిలో భోజనానికి ముందు కళ్ళు కడుక్కోవడం మనం చూస్తూనే వుంటాం ఆచరిస్తూ వుంటాం.

“అన్నం పరబ్రహ్మ స్వరూపం” అని ఆర్యవాక్యం

ఆహార ఉపాహారాల యిష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు, సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు, ఆహారాన్ని సక్రమంగా తీసుకొననివానికి ఏ కోరికలు ఉండవు” అని భగవద్గీతలో చెప్పబడింది. పూర్వకాలంలో భోజనశాలలు ఆవుపేడతో అలికి సున్నంతో గదిలోని నాలుగు మూలలా గీతలు, మధ్యలో ముగ్గులు వేసేవారు. అందుకే భోజనశాలలోకి సూక్ష్మక్రిములు ప్రవేశించేవి కావు. ఇలా చేసినప్పుడు ఆవుపేడలో, ఆవు మూత్రంలో మనుషులకు హానిచేసే సూక్ష్మక్రిములను చంపే శక్తి (పెన్సిలిన్) ఉంటుంది. భోజనం చేసిన తరువాత కూడా చీమలు, కీటకాలు రాకుండా క్రిందపడిన ఆహారపదార్థాలను తీసి మళ్ళీ నీటితో అలికి శుభాపరిచేవారు.

ప్రాణాలు కాపాడి, శక్తిని ఇచ్చే ఆహారాన్ని దైవసమానంగా భావించి గౌరవించి పూజించాలి అని పండితులు చెబుతున్నారు. అలాగే కొంతమంది చేతులు మాత్రమే కడుక్కుని కాళ్ళు కడగరు ఇలా చేసినట్లయితే బయటనుండి ఇంట్లోకి ప్రవేశించే ముందు శుభ్రంగా కాళ్ళు కడుక్కుని ప్రవేశించాలి. లేకపోతే వారి ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా చెడిపోతుంది. పూర్వకాలంలో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చేవారు. అసలు కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి ప్రవేశించడం తప్పనిసరిగా మన ఆచార వ్యవహారాలలో ఒకటిగా నేటికి చాలామంది కుటుంబాలలో ఆచరిస్తుంటారు. కరోనా నేర్పిన గుణపాఠాలతోనైనా మనం ఇప్పటి నుంచి అన్నం తినేటప్పుడు శుభ్రమైన ప్రదేశంలో, శుభ్రమైన శరీరంతో శుచితో ఆహారాన్ని స్వీకరిద్దాం. ఆరోగ్యంగా ఉందాం. సనాతన ధర్మంలోని ఆచారాలను ఆచరిద్దాం ఆనందంగా జీవితాలను గడుపుదాం.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news