గ్లామర్‌ టాలెంట్‌ లేకుండానే రష్మిక ఆ గోల్ రీచ్ అయిందా !

హీరోయిన్‌ అందంగా వుంటే చాలు. ఎట్రాక్ట్‌ చేసి పారేస్తారు. అతి తక్కువ మంది మాత్రం యాక్టింగ్‌తో ఇంప్రెస్‌ చేస్తారు. గూగుల్‌ను ఏలాలంటే.. అందం..అభినయంతో పనిలేదు. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. ఏకంగా గూగుల్‌ టాప్‌ఛైర్‌ వశమవుతుంది. 2019.. 2020 సంవత్సరానికిగాను గూగుల్‌ సెర్చ్‌లో ‘నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా’గా ఎంపికైంది ఎవరో తెలుసా? గ్లామర్‌ లేకుండా.. టాలెంట్‌ లేకుండా.. ఆ ప్లేస్‌ను రష్మిక ఎలా రీచ్‌ అయిందన్నదాని పై టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి.

2019-2020 మధ్య నెటిజన్లు గూగుల్లో రష్మిక మందాన్నాను ఎక్కువగా సెర్చ్‌ చేశారు. దీంతో.. నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియాగా ఎంపికైంది. కన్నడలో నాలుగు సినిమాలు చేసిన రష్మిక తెలుగులో ఛలో… భీష్మ.. సరిలేరునీకెవ్వరుతో సూపర్‌హిట్ అందుకుంది. తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన సుల్తాన్‌ ఇంకా రిలీజ్‌ కాలేదు. ఇండియాకు పెద్దగా పరిచయం లేని రష్మికను గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేయడం గూగుల్‌కే అంతుపట్టడం లేదు. గత కొన్నేళ్లుగా సన్నీలియోన్‌ ఈ ఘనత సాధిస్తూ వచ్చింది.

బోల్డ్‌ బ్యూటీ సన్నీని సర్చ్‌ చేసిన నెటిజన్లు.. గత ఏడాది రష్మిక మీద పడ్డారు. సన్నీ.. పూజా… దీపికను మించి గ్లామర్‌గా వుందని ఈమెను వెతకలేదట. అలాగని.. యాక్టింగ్‌తో కుమ్మేసిన పాత్రలేమీ పోషించలేదు. మరి రష్మికను ఎందుకు వెతికారంటే.. దానికి గూగుల్‌ రెండు కారణాలు చెబుతోంది. రష్మిక దుస్తులు ఎంపిక చేసుకునే విధానం నెటిజన్లకు బాగా నచ్చిందట. అలాగే.. ఆమె వేసుకునే రేడియెంట్‌ మేకప్‌ కూడా బాగా నచ్చిందట.

గూగుల్లో పాపులర్‌ కావాలంటే.. అందం.. అభినయంతో పనిలేదని రష్మిక చెప్పకనే చెప్పేసింది. డ్రస్‌ సెన్స్‌ వుండి.. డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్‌తో మెప్పిస్తే నెటిజన్లు ఫిదా అయిపోతారనడానికి రష్మికానే నిదర్శనం. ఈ అరుదైన అవార్డ్‌తో మున్ముందు ఇంకెన్ని రకాల కాస్ట్యూమ్స్‌తో ఇంప్రెస్‌ చేస్తుందో చూడాలి మరి.