ఛార్మి ఆఫీస్‌లో ప్ర‌భాస్ ఏం చేస్తున్నారు!

వ‌రుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ల‌తో ఫుల్ బిజీగా వున్నారు ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌‌క‌త్వంలో యువీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే ఇట‌లీ షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రభాస్ హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చార‌ని తెలుస్తోంది. సోష‌ల్ మీడియాలో ఛార్మి పెట్టిన పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌స్‌గా మారింది.

అల‌స్కాకి చెందిన మేల్ డాగ్ మ్యూట్ ప‌క్క‌నే ప్ర‌భాస్ క‌నిపిస్తున్నారు. డార్లింగ్‌ 9 నెల‌ల మేల్ డాగ్ తో వున్నాడంటూ ఛార్మి పోస్ట్ పెట్టింది. ఇంత‌కీ ఛార్మి ఆఫీస్‌లో ప్ర‌భాస్ ఏం చేస్తున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. పూరి జ‌గ‌న్నాథ్ – ప్ర‌భాస్ లు క‌లిసి ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని చేయ‌బోతున్నారంటూ వ‌రుస క‌థ‌నాలు ఇటీవ‌ల వినిపించాయి. ఆ వార్త‌ల్ని నిజం చేస్తూ పూరి క‌నెక్ట్స్‌ ఆఫీస్ లో ప్ర‌భాస్ క‌నిపించడంతో ఆ వార్త‌లకు బ‌లం చేకూరుతోంది.

మ‌రి ఈ వార్త‌ల్లో నిజ‌మెంత‌న్న‌ది తెలియాలంటే పూరి లేదా ప్ర‌భాస్ స్పందించాల్సిందే. పూరి జ‌గ‌న్నాథ్ – ప్ర‌భాస్‌ల క‌ల‌యిక‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు చిత్రాలొచ్చాయి. బుజ్జిగాడు, ఏక్ నిరంజ‌న్ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయాయి.