ఐసోలేషన్​లో బాలీవుడ్ హీరో సల్మాన్​ఖాన్..!

కండల వీరుడు ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నివాసంలో కరోనా కలకలం సృష్టించింది. సల్మాన్ డ్రైవరుతో పాటు సిబ్బందిలో ఇద్దురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సల్మాన్ ఖాన్ హోంక్వారంటైన్ లోకి వెళ్లారు.

salman khan
salman khan

అయితే కరోనా సోకిన తన సిబ్బందిని సల్మాన్ ముంబైలోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే..  లాక్ డౌన్ సమయంలో సల్మాన్ తన కుటుంబంతో కలిసి పన్వెల్ లోని తన ఫామ్ హౌస్ లో గడిపారు. వ్యవసాయ పనుల్లో పాల్గొంటూ కాలక్షేపం చేశారు. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించేందుకు కొన్ని వీడియోలను సైతం ఆయన అక్కడి నుంచి విడుదల చేశారు. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా షూటింగ్స్‌ ప్రారంభం కావడం వల్ల సల్మాన్‌ ‘రాధే’ చిత్రీకరణలో ఇటీవలే పాల్గొన్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్. మరోవైపు కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ సల్మాన్‌ పలు సందర్భాల్లో వీడియోలు కూడా షేర్‌ చేశారు.

మరోవైపు.. కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోయిందనే భావన దేశంలోని అనేక ప్రాంతాల్లోని ప్రజల్లో ఉంది. ఈ కారణంగానే చాలామంది కరోనా రాకుండా తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు పాటించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కరోనా మహమ్మారి ప్రభావం ఏ మాత్రం తగ్గలేదని ఢిల్లీలో నమోదవుతున్న కొత్త కేసులు, మరణాలను బట్టి అర్థమవుతోంది. కొద్దిరోజులుగా ఢిల్లీలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న దిల్లో రికార్డు స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. 131మంది వైరస్ బారినపడి చనిపోయారు. ఇప్పటివరకూ ఇదే అత్యధికం అని ప్రభుత్వం ప్రకటించింది.

అయితే సల్మాన్ ఇంట్లో కరోనా రావటంతో అభిమానులంతా షాక్ కు గురయ్యారు. ఏదిమైన కరోనా పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు, వైద్యులు కోరుతున్నారు. ఇప్పటికే సెకండ్ వేవ్ ప్రారంభమైంది. ..ఇది మరింత భయంకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.